Renigunta: విమానం రద్దయినట్లు చెప్పకపోవడంతో రేణిగుంటలో ప్రయాణికుల అవస్థలు

ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాసిన ఘటన రేణిగుంట విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

Updated : 29 May 2024 07:06 IST

రేణిగుంట, న్యూస్‌టుడే: ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాసిన ఘటన రేణిగుంట విమానాశ్రయంలో చోటు చేసుకుంది. స్టార్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం సోమవారం సాయంత్రం కలబురగి నుంచి రేణిగుంటకు రాత్రి 7.30 గంటలకు వచ్చి తిరిగి కలబురగికు వెళ్లాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల ఈ విమానాన్ని రద్దు చేశారు. ఇది తెలియక సుమారు 30 మంది విమానాశ్రయానికి చేరుకున్నారు. తమను గమ్యస్థానాలకు చేర్చాలని అక్కడే నిరసన తెలిపారు. తాము ఏమి చేయలేమని సంస్థ సిబ్బంది చేతులెత్తేయడంతో సోమవారం రాత్రంతా వీరు విమానాశ్రయంలోనే పడిగాపులు కాశారు. మంగళవారం వీరిలో కొంతమందిని కొల్హాపుర్‌కు, మరికొందరిని హుబ్బళ్లికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని