Andhra News: రైట్‌ చెప్పాలంటే గుంత పూడ్చాల్సిందే!

ఆ రోడ్డులో పలుచోట్ల పెద్ద పెద్ద గోతులున్నాయి. అప్రమత్తంగా లేకుంటే ఒళ్లు హూనం కావడంతోపాటు వాహన చక్రాలు ఎక్కడ ఊడిపోతాయో తెలియని పరిస్థితి.

Updated : 04 Oct 2022 08:53 IST

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ఆ రోడ్డులో పలుచోట్ల పెద్ద పెద్ద గోతులున్నాయి. అప్రమత్తంగా లేకుంటే ఒళ్లు హూనం కావడంతోపాటు వాహన చక్రాలు ఎక్కడ ఊడిపోతాయో తెలియని పరిస్థితి. దీంతో ప్రజా రవాణా శాఖ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో డ్రైవరు బి.ఎ.నాయుడు, కండక్టరు ఆర్‌.ఎస్‌. ప్రసాద్‌ బండరాళ్లను బస్సులో తీసుకువచ్చి గోతుల్లో వేసి రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం - తాండవ మార్గంలో ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవరు, కండక్టర్‌ రాళ్లను గోతుల్లో వేయడాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోమవారం సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. డ్రైవరు, సిబ్బంది చొరవను అనేక మంది ప్రశంసిస్తుండగా.. మరికొందరు రహదారి మరమ్మతుపై దృష్టిసారించని అధికార యంత్రాంగాన్ని విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని