Anna Canteen: అన్న క్యాంటీన్‌కు తాళం.. ఆరుబయటే అన్నదానం

జిల్లా కేంద్రం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.

Published : 24 Nov 2022 09:11 IST

జిల్లా కేంద్రం నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం అప్పట్లో దీన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు, వారి సహాయకులు ఆసుపత్రికి వస్తున్నారు. వారంతా గతంలో రూ.5కే ఆకలి తీర్చుకునేవారు. ప్రభుత్వం మారగానే అన్న క్యాంటీన్‌ను మూసివేశారు. భవనం నిరుపయోగంగా మారింది. సేవా ప్రగతి క్లబ్‌ వారు దాతల సహాయంతో రోజూ మధ్యాహ్నం, రాత్రి అన్నదానం చేస్తున్నారు. వారికి ఎలాంటి వసతీ కల్పించకపోవడంతో ఆరుబయట అరుగుపై ఆహార పదార్థాలు పెట్టుకుని వడ్డిస్తున్నారు. వర్షంపడితే ఆసుపత్రిలోకే వెళ్లి భోజనాలు అందించాల్సి వస్తోంది. నిరుపయోగంగా ఉన్న అన్న క్యాంటీన్‌ భవనంలో అవకాశం కల్పిస్తే సౌకర్యంగా ఉంటుందని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, నంద్యాల పాతపట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు