రాష్ట్రంలో కొత్త విమాన సర్వీసులు!

రాష్ట్రంలో కొత్తగా మూడు విమాన సర్వీసులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) నిర్ణయించింది.

Published : 28 Nov 2022 03:25 IST

3 మార్గాల్లో ఏపీఏడీసీఎల్‌ ప్రతిపాదన
6 నుంచి బెంగళూరు - విశాఖ మధ్య సర్వీసు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మూడు విమాన సర్వీసులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) నిర్ణయించింది. ఇందులో భాగంగా జరిపిన చర్చల్లో ఆయా మార్గాల్లో సర్వీసులు నడపడానికి ఇండిగో సంస్థ ప్రాథమికంగా అంగీకారం తెలిపింది. సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. రద్దీ ఎలా ఉంటుంది? విమానాలు అందుబాటులో ఉంటాయా? కొత్తగా సమకూర్చుకునేవి ఎప్పటిలోగా వస్తాయి? వంటి వివరాలను పరిశీలించిన తర్వాత సర్వీసులు నడిపే విషయమై ఇండిగో నిర్ణయం తీసుకుంటుందని ఏపీఏడీసీఎల్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు.    రీజినల్‌ కనెక్టివిటీ స్కీం (ఆర్‌సీఎస్‌) పథకం కింద కర్నూలు నుంచి విజయవాడ, తిరుపతి, విజయవాడ నుంచి విశాఖ మధ్య కొత్త సర్వీసులను ఏపీఏడీసీఎల్‌ ప్రతిపాదించింది. విజయవాడ నుంచి విశాఖకు ప్రతి రోజూ ఉదయం 8-9 గంటల మధ్య కొత్త సర్వీసు అవసరమన్న డిమాండు ఎప్పటి నుంచో ఉంది. ఈ మార్గాల్లో 80-90 శాతం రద్దీ ఉండే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఆర్‌సీఎస్‌ కింద కేంద్రం అనుమతిస్తే.. ఆయా మార్గాల్లో  సర్వీసులు నడిపే సంస్థకు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) వర్తిస్తుంది.

6 నుంచి బెంగళూరు-విశాఖ మధ్య సర్వీసు

వచ్చే నెల 6వ తేదీ నుంచి బెంగళూరు- విశాఖపట్నం మధ్య వారంలో రెండు రోజులు సర్వీసులు నడపాలని ఆకాశ ఎయిర్‌లైన్స్‌ సంస్థ నిర్ణయించిందని ఏపీఏడీసీఎల్‌ అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రం ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని