ప్రభుత్వం పిల్లిమొగ్గ
ఓపీఎస్‌పై స్పష్టమైన హామీ లేనిదే ప్రభుత్వంతో చర్చలకు హాజరు కాబోమని వివిధ ఉద్యోగసంఘాలు స్పష్టం చేయడంతో.. ప్రభుత్వం పిల్లిమొగ్గ వేసింది.
తొలుత సీపీఎస్‌పై సమావేశమని.. ఆ తరువాత ఉద్యోగుల సమస్యలపై అంటూ సంఘాల నేతలకు ఆహ్వానం
ఓపీఎస్ అమలుపై స్పష్టత ఇస్తేనే వస్తామన్న ఉద్యోగ సంఘాలు
సీఎంతో మాట్లాడాక ప్రత్యేక సమావేశం పెడతామన్న మంత్రులు
ఈనాడు, అమరావతి: ఓపీఎస్‌పై స్పష్టమైన హామీ లేనిదే ప్రభుత్వంతో చర్చలకు హాజరు కాబోమని వివిధ ఉద్యోగసంఘాలు స్పష్టం చేయడంతో.. ప్రభుత్వం పిల్లిమొగ్గ వేసింది. సీపీఎస్‌పై ఏర్పాటుచేసిన సమావేశాన్ని.. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్దేశించినదిగా మార్చేసింది. సీపీఎస్‌పై చర్చించేందుకే సమావేశమని 21 ఉద్యోగసంఘాల నేతలకు తొలుత సమాచారం పంపిన ప్రభుత్వం.. తర్వాత సమాచార లోపంతోనే అలా జరిగిందని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. ఉద్యోగసంఘాల నేతలకు ఫోన్ చేసి ఉద్యోగుల సమస్యలపైనే చర్చిద్దామని పిలిచింది. సమావేశ వేదికనూ ఆర్థికశాఖ కార్యాలయం నుంచి సచివాలయానికి మార్చింది. దీంతో సీపీఎస్ ఉద్యోగుల సంఘం (సీపీఎస్‌యూఎస్), సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (సీపీఎస్‌ఈఏ), ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) మినహా మిగిలిన సంఘాలు హాజరయ్యాయి. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి పాల్గొని ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. సీఎంతో మాట్లాడిన తర్వాత సీపీఎస్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపైనా ఏ విషయంలోనూ మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. చూద్దాం, చేద్దాం, సీఎంతో చర్చించి చెబుతామనే వైఖరిలోనే సాగిందని కొందరు నాయకులు పేర్కొన్నారు. బిల్లులు నెలలోపు చెల్లిస్తామనే విషయంలోనూ స్పష్టత లేదని చెప్పారు.
బకాయిల్లో కొంత సంక్రాంతి లోపు చెల్లిస్తాం
ఉద్యోగులకు 2018 నుంచి చెల్లించాల్సిన బకాయిల్లో కొంత మొత్తాన్ని సంక్రాంతిలోపు చెల్లిస్తామని, మిగతా వాటిని మార్చిలోపు చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చినట్లు ఉద్యోగసంఘాల నేతలు విలేకరులకు చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలపై అధికారులతో గురువారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అంగీకారం తెలిపారని వివరించారు.
కొన్నింటికి న్యాయ వివాదాలున్నాయి: మంత్రి బొత్స
‘సీపీఎస్ అంశంపై సమావేశం ఉంటుందని చెప్పడం సమాచార లోపమే. నాలుగురోజుల నుంచి కొన్ని సమస్యలపై చర్చించాలని నాయకులు కోరడంతోనే ఈ సమావేేశం నిర్వహించాం. సీపీఎస్‌పై మరో సమావేశం నిర్వహిస్తాం. చర్చలపై ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నాం. బోధన సిబ్బందికి పదవీవిరమణ వయస్సును 62ఏళ్లకు పెంచడంపై గతంలో సీఎం హామీ ఇచ్చారు. ఇది అమలుచేస్తాం. మిగతా వాటిలో న్యాయ వివాదాలున్నాయి. పరిష్కరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం.’
ఉద్యోగుల సమస్యలపై అని చెప్పడంతోనే హాజరయ్యాం
ప్రతినెలా జీతాలు, పింఛన్లు ఒకటో తేదీన గత కొంతకాలంగా రాకపోవడం బాధాకరమని ఉద్యోగసంఘాల నేతలు పేర్కొన్నారు. ‘అధికారులు ఫోన్ చేసి ఉద్యోగుల సమస్యలపై చర్చ జరుగుతుందని చెప్పడంతోనే హాజరయ్యాం. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని కోరాం. ఉద్యోగుల పీఆర్‌సీ పేస్కేళ్లను శాఖాధిపతుల కార్యాలయాలకు పంపాలని చెప్పాం. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత బలోపేతం చేసేలా ఆస్పత్రుల యాజమాన్యాలు, ఉద్యోగులతో సంయుక్త సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు’ అని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు తదితరులు పేర్కొన్నారు. ‘ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చించాం. పొరుగుసేవల ఉద్యోగులు 17మంది తొలగింపు అధికారులు అనుకోకుండా చేసిన తప్పని.. ఎవర్నీ తొలగించబోమని చెప్పారు. ముఖ అధారిత హాజరుపై అధికారులు ఒకలా.. మంత్రులు మరోలా చెప్పారు. హాజరు నమోదు కాకపోతే జీతంలో కోత పెడతామని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతుండగా.. మంత్రివర్గ ఉపసంఘం మాత్రం కోత లేదని, హాజరు కోసమే అంటున్నారు. ఓపీఎస్ అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండు చేశాం. డీఎస్సీ-2003కి ఎంపికైన వారికి పాత పింఛను అమలుచేయాలని కోరాం’ అని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, చిరంజీవి, ఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయి శ్రీనివాస్, తిమ్మన్న తదితరులు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి