ఆలయాలపై అదనపు కమిషనర్లకు అధికారం

రాష్ట్రంలోని రూ.కోటిపైన వార్షికాదాయం ఉన్న ఆలయాలు (6ఎ)తో పాటు ఇతర వాటిపై వివిధ రకాల అధికారాలను కమిషనర్‌ నుంచి అదనపు కమిషనర్లకు అప్పగిస్తూ ఆ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 08 Dec 2022 05:13 IST

13 ఏళ్ల కిందటి ఉత్తర్వులు ఇప్పుడు అమల్లోకి

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలోని రూ.కోటిపైన వార్షికాదాయం ఉన్న ఆలయాలు (6ఎ)తో పాటు ఇతర వాటిపై వివిధ రకాల అధికారాలను కమిషనర్‌ నుంచి అదనపు కమిషనర్లకు అప్పగిస్తూ ఆ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ అధికారాలను బదలాయిస్తూ 2009లోనే ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వీటిని అమల్లోకి తీసుకొస్తూ ఆదేశాలిచ్చారు. దేవాదాయ కమిషనరేట్‌లో ఇద్దరు అదనపు కమిషనర్లు ఉండగా.. వీరికి రాష్ట్రంలోని అనేక ఆలయాలు, వాటిలోని ఉద్యోగుల చర్యలు తీసుకునే అధికారం వచ్చినట్లయింది.

* ఆర్‌జేసీ కేడర్‌ ఈవోలు ఉన్న ప్రధాన ఆలయాలు మినహా రూ.కోటిపైన వార్షికాదాయం ఉన్న వాటిల్లో తనిఖీల అధికారాన్ని...  జోన్‌ 1, 3 పరిధిలో వాటికి అదనపు కమిషనర్‌-1, జోన్‌ 2, 4 పరిధిలో వాటికి అదనపు కమిషనర్‌-2కి అప్పగించారు.

* ఈ ఆలయాల్లో దిట్టం ఖరారు, బడ్జెట్‌, లీజులు, లైసెన్సుల మంజూరు, సివిల్‌ పనులకు పరిపాలన అనుమతులు.. తదితరాలను రెండు జోన్లలో వేర్వేరుగా ఇద్దరు అదనపు కమిషనర్లకు కట్టబెట్టారు.

* ఆర్‌జేసీ క్యాడర్‌ ఈవోలు ఉండేవి మినహా, రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, దేవాదాయ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారం అదనపు కమిషనర్‌-2కి అప్పగించారు.

* భూముల అంశాలకు చెందిన దస్త్రాలు అదనపు కమిషనర్‌-1 ద్వారా, ఉద్యోగుల సర్వీస్‌ అంశాలకు చెందిన దస్త్రాలు అదనపు కమిషనర్‌-2 ద్వారా కమిషనర్‌కు చేరేలా ఆదేశాలిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు