The Immortal Saga: ఈనాడు ‘అమృతగాథ’ పుస్తకంపై ఝార్ఖండ్‌ సీఎం ప్రశంసలు

స్వాతంత్య్ర సమరయోధుల వీరోచిత గాథలతో ‘ది ఇమ్మోర్టల్‌ సాగా - ఇండియాస్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఫ్రీడమ్‌’ పుస్తకాన్ని ప్రచురించిన ‘ఈనాడు’ను ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రశంసించారు.

Updated : 14 Dec 2022 11:26 IST

ఈటీవీ భారత్‌: స్వాతంత్య్ర సమరయోధుల వీరోచిత గాథలతో ‘ది ఇమ్మోర్టల్‌ సాగా - ఇండియాస్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఫ్రీడమ్‌’ పుస్తకాన్ని ప్రచురించిన ‘ఈనాడు’ను ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రశంసించారు. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు తరఫున ఈటీవీ భారత్‌ ప్రతినిధి రాజేష్‌ కుమార్‌ సింగ్‌.. ఝార్ఖండ్‌ సీఎంకు ఈ పుస్తకాన్ని అందజేశారు. ఝార్ఖండ్‌కు చెందిన ఉద్యమ వీరులు భగవాన్‌ బిర్సా ముండా, శ్రీ జైపాల్‌ సింగ్‌ ముండా చేసిన పోరాటాన్ని వివరిస్తూ.. ది స్టోరీ ఆఫ్‌ ప్రౌడ్‌ ట్రైబల్‌ అండ్‌ బిర్సా ముండా- ది ‘గాడ్‌ ఆన్‌ ది ఎర్త్‌’ అనే కథనాన్ని ఈ పుస్తకంలో ప్రచురించారు. ఈ సందర్భంగా సోరెన్‌ మాట్లాడుతూ.. ‘అమర్‌ షహీద్‌ తిల్కా మాంఝీ, సిద్ధో-కాన్హో, వీర్‌ బుధు భగత్‌, భగవాన్‌ బిర్సా ముండా వంటి వీరుల పోరాటం, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. వారిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను పురస్కరించుకుని ఈనాడు గ్రూప్‌ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. దీన్ని ఇటీవల ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని