EPF: ‘ఈపీఎఫ్‌ కనీస పింఛను రూ.9 వేలు ఇవ్వాలి’

ఈపీఎఫ్‌ కింద కనీస పింఛను రూ.9 వేలు ఇవ్వాలని అఖిల భారత ఈపీఎస్‌ పెన్షనర్ల సమన్వయ కమిటీ నేతలు డిమాండ్‌ చేశారు.

Updated : 09 Dec 2022 11:17 IST

ఈనాడు, దిల్లీ: ఈపీఎఫ్‌ కింద కనీస పింఛను రూ.9 వేలు ఇవ్వాలని అఖిల భారత ఈపీఎస్‌ పెన్షనర్ల సమన్వయ కమిటీ నేతలు డిమాండ్‌ చేశారు. కనీస పింఛను పెంపు కోరుతూ కమిటీ ఆధ్వర్యంలో గురువారం దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించారు. వీరి ఆందోళనకు ఆర్‌ఎస్పీ ఎంపీ ప్రేమ్‌చంద్రన్‌, ఐయూఎంల్‌ ఎంపీ బషీర్‌, డీఎంకే, సీపీఎం రాజ్యసభ సభ్యులు షణ్ముగం, ఎలమారం కరీంలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఆర్‌.సి.గుప్తా కేసులో కోర్టు తీర్పు ప్రకారం అత్యధిక పింఛను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆంధప్రదేశ్‌, తెలంగాణ కమిటీ నాయకులు సుధాకర్‌, కృష్ణమూర్తి, వివిధ రాష్ట్రాల నాయకులు బ్రహ్మ, ధర్మజన్‌, అతుల్‌ ధిగే తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని