Andhra News: రైతుబిడ్డకు రూ.1.2 కోట్ల ప్యాకేజీతో కొలువు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాత జంగాలపల్లికి చెందిన ఈగ వెంకటసాయికృష్ణారెడ్డి ఇటీవల ఖరగ్‌పూర్‌ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఏడాదికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు.

Updated : 25 Jan 2023 07:56 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాత జంగాలపల్లికి చెందిన ఈగ వెంకటసాయికృష్ణారెడ్డి ఇటీవల ఖరగ్‌పూర్‌ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఏడాదికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. ఇతడు చిన్నకారు రైతు మురళీమనోహర్‌రెడ్డి- లక్ష్మీదేవి దంపతుల కుమారుడు. సాయికృష్ణారెడ్డి ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ఉత్తమ మార్కులు పొందారు. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఈసీఈ చదివి 92% మార్కులు పొందారు. నాలుగో ఏడాదిలో ఉండగానే.. ఇంటెల్‌ సంస్థలో కొలువు సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని