శ్రీవారి సేవలో అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌

తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, కాబోయే కోడలు రాధికా మర్చంట్‌ గురువారం దర్శించుకున్నారు.

Published : 27 Jan 2023 04:16 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారిని ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, కాబోయే కోడలు రాధికా మర్చంట్‌ గురువారం దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం, తితిదే అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవేంకటేశ్వర గోశాలను సందర్శించి స్వామివారి గజరాజుల ఆశీస్సులను వారు అందుకున్నారు. వీరితోపాటు వచ్చిన సినీనటి జాన్వీ కపూర్‌ ఉదయం శ్రీవారి అర్చనానంతర సేవలో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని