లక్ష్య సాధనకు యువత కృషి చేయాలి

యువత కష్టపడి అవకాశాలను సృష్టించుకుని తమ లక్ష్య సాధనకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ సూచించారు.

Published : 29 Jan 2023 04:22 IST

జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: యువత కష్టపడి అవకాశాలను సృష్టించుకుని తమ లక్ష్య సాధనకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. సాహితీ గగన్‌మహల్‌ ట్రస్టు అధ్యక్షుడు జె.ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం నిర్వహించిన 8వ అనంత ఆణిముత్యాల పురస్కార ప్రదానోత్సవంలో జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌తోపాటు వివిధ రంగాల్లో రాణించిన 23 మందిని ఘనంగా సత్కరించారు. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌, సినీ నటుడు బాబూమోహన్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈవో మఠం వెంకటరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని