మిర్చి తోటలో ఆశల దీపం!

మిర్చి పంటలో పురుగుల బెడదను తగ్గించేందుకు రైతులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

Published : 05 Feb 2023 04:54 IST

మిర్చి పంటలో పురుగుల బెడదను తగ్గించేందుకు రైతులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చమళ్లమూడి గ్రామానికి చెందిన రైతు నాగమల్లేశ్వరరావు తన మిర్చి తోటలో సౌర శక్తితో పని చేసే పురుగు ఆకర్షణ బుట్టలు ఏర్పాటు చేశారు. ఎకరా తోటకు బుట్టలు పెట్టేందుకు రూ.4,500 ఖర్చు వచ్చిందని తెలిపారు. పగలంతా ఛార్జింగ్‌ అయి.. చీకటి పడగానే లైట్లు వాటంతటవే వెలుగుతున్నాయి. వెలుగుకు వచ్చిన పురుగులు బుట్టలో ఉన్న ద్రావణంలో పడి చనిపోతున్నాయి. గతంలో ఉపయోగించిన జిగురు పలకల కంటే వీటితో పురుగులను పూర్తిగా కట్టడి చేయగలుగుతున్నామని రైతు తెలిపారు.

ఈనాడు గుంటూరు- న్యూస్‌టుడే, వట్టిచెరుకూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని