చదరంగ క్రీడాకారిణి మీనాక్షికి రూ.కోటి సాయం

విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి కోలగట్ల అలన మీనాక్షికి రూ.కోటి ఆర్థిక సాయం, విశాఖలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

Published : 07 Feb 2023 03:55 IST

విశాఖలో వెయ్యి గజాల ఇంటి స్థలం
సీఎం జగన్‌ ప్రకటన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి కోలగట్ల అలన మీనాక్షికి రూ.కోటి ఆర్థిక సాయం, విశాఖలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను.. తల్లిదండ్రులు అపర్ణ, మధులతో కలసి ఆమె సోమవారం కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా మరింత రాణించాలని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని జగన్‌ తెలిపారు. చదరంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు రికార్డులు నెలకొల్పిన మీనాక్షి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2023 పురస్కారాన్ని అందుకున్నారు.


సీఎంను కలిసిన పర్వతారోహకురాలు ఆశా మాల్వి

ఈనాడు, అమరావతి: మహిళలకు భారత్‌లోనే పూర్తి భద్రత ఉందని ప్రపంచానికి చాటేలా, మహిళా సాధికారత వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు దేశవ్యాప్తంగా 25 వేల కి.మీ.ల సైకిల్‌ యాత్ర ఒంటరిగా చేపట్టాను...’ అని పర్వతారోహకురాలు ఆశా మాల్వి వెల్లడించారు. సోమవారం ఆమె ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ‘ఈ ఆలోచన, కృషిని ప్రశంసించిన సీఎం, ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. రూ.10 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. అనంతరం ఆశా విలేకరులతో మాట్లాడారు. ‘మాది మధ్యప్రదేశ్‌లోని సతారామ్‌. నవంబరు 1న భోపాల్‌లో యాత్ర ప్రారంభించి విజయవాడ చేరుకున్నాను. మొత్తం 28 రాష్ట్రాల్లో నిర్వహించాలనేది లక్ష్యం.ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్ల యాత్ర పూర్తయింది’ అని ఆశా మాల్వి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని