180 జంటల షష్టిపూర్తి మహోత్సవం

ఉగాది వేళ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 180 జంటల షష్టిపూర్తి మహోత్సవం బుధవారం సందడిగా సాగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యాన రొటేరియన్‌ మండవిల్లి వెంకన్నబాబు ఆర్థిక సహకారంతో స్థానిక మాధవి కల్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 23 Mar 2023 04:02 IST

రాజానగరం, న్యూస్‌టుడే: ఉగాది వేళ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో 180 జంటల షష్టిపూర్తి మహోత్సవం బుధవారం సందడిగా సాగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యాన రొటేరియన్‌ మండవిల్లి వెంకన్నబాబు ఆర్థిక సహకారంతో స్థానిక మాధవి కల్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి 180 జంటలు ఇందులో పాల్గొన్నాయి. వేదికపై శివలింగం ఏర్పాటు చేసి రుద్రాభిషేకం చేశారు. దంపతులు ఒకే ఆకులో భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా ఆర్య వైశ్య సంఘం ఉపాధ్యక్షుడు గ్రంథి నానబ్బులు, రాజానగరం మండల శాఖ అధ్యక్షుడు సముద్రాల రాంబాబు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని