శ్రీశైలక్షేత్రంలో 4,430 ఎకరాల వివాదాస్పద భూములకు పరిష్కారం

శ్రీశైలక్షేత్రంలో వివాదంలో ఉన్న 4,430 ఎకరాలకు స్కెచ్‌లు సహా సరిహద్దులు నిర్ణయించినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

Updated : 24 Mar 2023 05:34 IST

మంత్రి కొట్టు సత్యనారాయణ

ఈనాడు, అమరావతి: శ్రీశైలక్షేత్రంలో వివాదంలో ఉన్న 4,430 ఎకరాలకు స్కెచ్‌లు సహా సరిహద్దులు నిర్ణయించినట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అటవీ, రెవెన్యూ, దేవాదాయశాఖల అధికారులు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఆయన సచివాలయంలోని మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి మాట్లాడుతూ తెలిపారు. శ్రీశైలక్షేత్ర శిఖరం, సాక్షి గణపతి, హఠకేశ్వరం, ముఖ ద్వారం వద్ద అభివృద్ధి పనులకు అవసరమైన 360 ఎకరాల అటవీ భూముల సేకరణకు కేంద్ర అటవీశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.

48,416 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందించాం: ప్రభుత్వం నిర్ణయించిన 1.50 లక్షల టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల్లో 2023 మార్చి వరకు 48,416 మందికి ఇళ్లను అప్పగించినట్లు మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ లిఖితపూర్వకంగా తెలియజేశారు. తెదేపా సభ్యులు నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయస్వామి, నిమ్మకాయల చినరాజప్ప, బెందాళం అశోక్‌, వెలగపూడి రామకృష్ణబాబు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మిగిలిన ఇళ్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగు నేపథ్యంలో సభలో లేనందున ఇది చర్చకు రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని