రంగస్థలానికి పూర్వ వైభవం రావాలి

‘కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. రంగస్థలానికి పూర్వ వైభవం రావాలి’ అని ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం ఒక ప్రకటనలో తన శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 28 Mar 2023 04:59 IST

పవన్‌కల్యాణ్‌ ఆకాంక్ష

ఈనాడు,అమరావతి: ‘కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. రంగస్థలానికి పూర్వ వైభవం రావాలి’ అని ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోమవారం ఒక ప్రకటనలో తన శుభాకాంక్షలు తెలియజేశారు. నాటకం వర్తమాన సమాజాన్ని, మానవ జీవితాలను, భిన్న మనస్తత్వాలను ఆవిష్కరిస్తూనే ఉందని, నాటక రంగం నుంచి వచ్చిన నటులు, దర్శకులు తరవాత వెండి తెర, లేదా బుల్లితెరపై తమ కళాభినివేశాన్ని ప్రదర్శించడంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని పేర్కొన్నారు. కన్నడ, మరాఠీ భాషల తరహాలోనే తెలుగులోనూ రంగస్థలానికి ప్రేక్షకాదరణ దక్కాలని కోరారు. నటుడిగా కెమెరా ముందుకు వచ్చేందుకు తాను విశాఖలో సత్యానంద్‌ వద్ద శిక్షణ తీసుకున్నానని, ఆయన తమతో నాటికలు, నాటకాలు, వీధి నాటకాలు వేయించేవారని పేర్కొంటూ ప్రపంచ నాటక రంగ దినోత్సవం సందర్భంగా ఆయనకు నమస్సులు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు