బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
డా.అచ్చెన్న హత్యపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: డా.అచ్చెన్న హత్యపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఆయన గురువారం కర్నూలులో డా.అచ్చెన్న కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘అపహరణకు గురైన రోజు నుంచి హత్య జరిగిన పది రోజుల వరకు పోలీసు శాఖ ఎందుకు నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. అప్పుడేమో ఫోన్ కాల్ డేటా, సీసీ కెమెరాలు లేవని చెప్పారు. ఇదంతా నిందితులను రక్షించేందుకే తప్ప మరొకటి కాదు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి’ అని మందకృష్ణ డిమాండ్ చేశారు. ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసుశాఖను తన తండ్రి కోరగా ఏమాత్రం పట్టించుకోలేదని
డాక్టర్‌అచ్చెన్న కుమారుడు క్లింటన్ చక్రవర్తి పేర్కొన్నారు.
అచ్చెన్న హత్య కేసు నిందితులను శిక్షించాలి
ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్ జిల్లా పశుసంవర్ధక శాఖ డీడీ డా.అచ్చెన్న హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ కోరారు. కర్నూలులో ఉంటున్న డాక్టర్ అచ్చెన్న కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డా.అచ్చెన్న కుల వివక్షను ఎదుర్కొని హత్యకు గురయ్యారని అన్నారు. హత్యకు కారకులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. అచ్చెన్న కుటుంబ సభ్యులను అన్నివిధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
CM Jagan Tour: జగన్ పర్యటన.. పత్తికొండలో విద్యుత్ కోతలు
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!