Andhra News: ఈ వృద్ధుడు.. మృత్యుంజయుడు

కళ్లు సరిగ్గా కన్పించక బావిలో పడిపోయిన ఓ వృద్ధుడు రెండు రోజుల తర్వాత సురక్షితంగా బయటపడిన వైనమిది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వర్లి గ్రామానికి చెందిన పోలన్న (85) గురువారం సాయంత్రం ఇంటి నుంచి పొలానికి వెళ్లారు.

Updated : 02 Apr 2023 07:01 IST

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కళ్లు సరిగ్గా కన్పించక బావిలో పడిపోయిన ఓ వృద్ధుడు రెండు రోజుల తర్వాత సురక్షితంగా బయటపడిన వైనమిది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వర్లి గ్రామానికి చెందిన పోలన్న (85) గురువారం సాయంత్రం ఇంటి నుంచి పొలానికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు రాత్రివేళ కళ్లు సరిగ్గా కనిపించక గ్రామ శివారులోని ఓ బావిలో పడిపోయారు. అతని ఆచూకీ కోసం కుటుంబసభ్యులు పలుచోట్ల గాలించారు. ఫొటో, వివరాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. శనివారం ఆ దారిలో వస్తున్న రైతులు.. బావిలోంచి శబ్దాలు రావడాన్ని గమనించి వెళ్లి చూడగా పోలన్న ఓ మూలన ముళ్ల చెట్ల మధ్య పడి ఉన్నారు. కుటుంబసభ్యులు, గ్రామస్థులు బావిలోకి దిగి వృద్ధుడిని బయటకు తీశారు. రెండు రోజులుగా తిండి, నీళ్లు లేక నీరసించిపోయిన వృద్ధుడిని 108లో కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని