JEE Advanced: మూడు పరీక్షల్లోనూ 1వ ర్యాంకు మన విద్యార్థులదే

ప్రస్తుత విద్యా సంవత్సరం (2023-24)లో బీటెక్‌, ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి జాతీయస్థాయిలో నిర్వహించిన మూడు ప్రవేశ పరీక్షల్లోనూ ప్రథమ ర్యాంకులను తెలుగు రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొని జాతీయస్థాయిలో ప్రత్యేకతను సాధించారు.

Published : 19 Jun 2023 09:20 IST

జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో తెలుగోళ్ల సత్తా

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత విద్యా సంవత్సరం (2023-24)లో బీటెక్‌, ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి జాతీయస్థాయిలో నిర్వహించిన మూడు ప్రవేశ పరీక్షల్లోనూ ప్రథమ ర్యాంకులను తెలుగు రాష్ట్రాల విద్యార్థులే దక్కించుకొని జాతీయస్థాయిలో ప్రత్యేకతను సాధించారు. ఏప్రిల్‌ 30న వెల్లడైన జేఈఈ మెయిన్‌లో సింగరాజు వెంకట కౌండిన్య (హైదరాబాద్‌) 300కి 300 మార్కులు దక్కించుకొని మొదటి ర్యాంకు సాధించగా.. ఈ నెల 13న వెల్లడైన నీట్‌-యూజీ ఫలితాల్లో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి 720కి 720 మార్కులతో ప్రథమ ర్యాంకు పొందాడు. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన వావిలాల చిద్విలాస్‌రెడ్డి 360కి 341 మార్కులు సాధించి తొలి ర్యాంకు కైవసం చేసుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని