Nandyal: ఇక నుంచి ఆ రోడ్డు పేరు ‘బుగ్గన మార్గ్‌’

ప్రజాధనంతో వేసిన రహదారులకు మంత్రుల పేర్లు పెట్టే సంప్రదాయమూ రాష్ట్రంలో మొదలైంది. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన నంద్యాల జిల్లా డోన్‌లో ఇటీవల బీటీ రహదారిని నిర్మించారు.

Updated : 28 Jun 2023 10:05 IST

ప్రజాధనంతో వేసిన రహదారులకు మంత్రుల పేర్లు పెట్టే సంప్రదాయమూ రాష్ట్రంలో మొదలైంది. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన నంద్యాల జిల్లా డోన్‌లో ఇటీవల బీటీ రహదారిని నిర్మించారు. పట్టణంలోని గాంధీ సర్కిల్‌ నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే ఈ మార్గం అందుబాటులోకి రావడంలో ఆర్థికమంత్రి కృషి ఉందని.. ఇక నుంచి దాన్ని ‘బుగ్గన మార్గ్‌’ అని పిలుద్దామంటూ పురపాలక కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పురపాలక ఛైర్మన్‌ ఎస్‌. రాజేష్‌, కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి ప్రతిపాదించారు. ఇందుకోసం ప్లకార్డులూ ప్రదర్శించారు. కౌన్సిల్‌ అంతా వైకాపా నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులే ఉండటంతో దాన్ని ఆమోదించారు. 

 న్యూస్‌టుడే, డోన్‌ పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని