Kakinada: యువతులతో వైకాపా నాయకుల నృత్యాలు

వైకాపా నాయకులు తమ పదవులు మరిచి ఓ వేడుకలో యువతులతో చిందులేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం శివారులోని వ్యవసాయ క్షేత్రంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమం ఇంచుమించు రికార్డింగ్‌ డ్యాన్స్‌ తరహాలో సాగింది.

Updated : 29 Jun 2023 07:25 IST

ఏలేశ్వరం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు తమ పదవులు మరిచి ఓ వేడుకలో యువతులతో చిందులేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం శివారులోని వ్యవసాయ క్షేత్రంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమం ఇంచుమించు రికార్డింగ్‌ డ్యాన్స్‌ తరహాలో సాగింది. ఆ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. యర్రవరం గ్రామానికి చెందిన రైతు సామర్లకోటలోని తమ బంధువు పుట్టిన రోజు వేడుకను వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేశారు. దీనికి యర్రవరం గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులను ఆహ్వానించారు. యువతుల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో యర్రవరం సర్పంచి బీశెట్టి అప్పలరాజు, ఆ గ్రామంలోని హనుమాన్‌ ఆలయ ధర్మకర్త జి.గంగాధర్‌, జడ్పీటీసీ సభ్యురాలి భర్త, వైకాపా నాయకుడు నీరుకొండ సత్యనారాయణ ఐటెం సాంగ్‌లకు యువతులతో కలిసి నృత్యాలు చేశారు. ఈ వీడియో చూసిన స్థానికులు నాయకుల తీరుపై ముక్కున వేలేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని