Parvathipuram Manyam: పసిబిడ్డ రక్షణకు కర్రల పడవపై సాహసం

అస్వస్థతకు గురైన చిన్నారికి అత్యవసర వైద్యం అందించేందుకు తల్లిదండ్రులు సాహసమే చేశారు. చిన్నారిని ఒడిలో పెట్టుకొని వెదురు కర్రలపై ఉద్ధృతంగా పారుతున్న నాగావళి నదిని దాటారు.

Updated : 05 Aug 2023 07:09 IST

కొమరాడ, న్యూస్‌టుడే: అస్వస్థతకు గురైన చిన్నారికి అత్యవసర వైద్యం అందించేందుకు తల్లిదండ్రులు సాహసమే చేశారు. చిన్నారిని ఒడిలో పెట్టుకొని వెదురు కర్రలపై ఉద్ధృతంగా పారుతున్న నాగావళి నదిని దాటారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ఈ ఘటన జరిగింది. ఆంధ్ర- ఒడిశా సరిహద్దులోని చోళపదం పంచాయతీ రెబ్బ గ్రామానికి చెందిన కోలక మరియమ్మ (7) తీవ్ర జ్వరం, మూర్చతో బాధపడుతోంది. తల్లడిల్లిపోయిన తల్లిదండ్రులు వెదురు కర్రలను నీటిపై తేలేలా కట్టుకొని దానిపై నది దాటారు. అనంతరం 17 కిలోమీటర్ల దూరంలోని ఒడిశాలోని రాయగడ ఆసుపత్రికి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని