CM Jagan: ‘నువ్వు తిరుగు.. లేదంటే నీ కొడుకును తిప్పు’

‘నువ్వు బాగా తిరుగు.. లేదా నీ కొడుకు డాక్టర్‌ శ్రీకాంత్‌ను బాగా తిప్పు..’ అని ముఖ్యమంత్రి జగన్‌ అమలాపురంలో సభావేదికపై మంత్రి విశ్వరూప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Updated : 12 Aug 2023 08:23 IST

సీఎం వ్యాఖ్యలతో అమలాపురం అభ్యర్థిత్వంపై చర్చ

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: ‘నువ్వు బాగా తిరుగు.. లేదా నీ కొడుకు డాక్టర్‌ శ్రీకాంత్‌ను బాగా తిప్పు..’ అని ముఖ్యమంత్రి జగన్‌ అమలాపురంలో సభావేదికపై మంత్రి విశ్వరూప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో పక్కనే నిల్చున్న మంత్రిని చూస్తూ ఈ మాట అన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి విశ్వరూపా..? ఆయన కుమారుడా అనే చర్చ తెరమీదికి వచ్చింది. మీ గ్రామాల్లో అభివృధ్ధి చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందని ప్రకటించిన సీఎం.. అమలాపురంలో మూడు పాత వంతెనల పునర్నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 84 సచివాలయాలకు రూ.40 లక్షల చొప్పున ‘గడప గడపకూ’ కార్యక్రమం కింద నిధులు మంజూరుచేస్తానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని