APPSC: ఏపీపీఎస్సీ రాత పరీక్షలకు తేదీలు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 11 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల రాత పరీక్షల  తేదీలను గురువారం ప్రకటించింది.

Updated : 18 Aug 2023 07:48 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 11 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల రాత పరీక్షల  తేదీలను గురువారం ప్రకటించింది. ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు రాత పరీక్షలు సెప్టెంబరు 25 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయి. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (భూగర్భ నీటిపారుదల శాఖ), అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, ఇండస్ట్రీయల్‌ ప్రమోషన్‌ ఆఫీసర్‌, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌, గ్రూపు-4 (లిమిటెడ్‌), జూనియర్‌ ట్రాన్సలేటర్‌ తెలుగు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (మైన్స్‌), డిస్ట్రిక్ట్‌ ప్రొబెషన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 (జువైనల్‌ వెల్ఫేర్‌) ఉద్యోగాలకు జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ పరీక్ష అక్టోబరు 3న జరగనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి సబ్జెక్టు రాత పరీక్షలు వేర్వేరు తేదీల్లో ఆన్‌లైన్‌లో జరుగుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని