Wanaparthy: ఒక్కరోజే 32 ప్రసవాలు

వనపర్తి మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో శనివారం 32 ప్రసవాలు జరిగాయి. వీటిలో 17 సాధారణ కాన్పులు కాగా.. 15 సిజేరియన్లు ఉన్నాయి.

Updated : 21 Aug 2023 07:57 IST

న్యూస్‌టుడే, వనపర్తి న్యూటౌన్‌: వనపర్తి మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో శనివారం 32 ప్రసవాలు జరిగాయి. వీటిలో 17 సాధారణ కాన్పులు కాగా.. 15 సిజేరియన్లు ఉన్నాయి. 13 మందికి తొలి కాన్పులు జరగగా.. వీరిలో 9 మందికి సాధారణ ప్రసవాలు అయ్యాయి. తాజా ప్రసవాల్లో 20 మంది మగ, 12 మంది ఆడ శిశువులు జన్మించారు. వనపర్తిలో మూడు నెలల క్రితం 29 ప్రసవాలు జరగగా.. ఆ రికార్డును ఇప్పుడు అధిగమించినట్లు గైనకాలజిస్టు విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్‌ అరుణకుమారి, ప్రొఫెసర్‌ కిరణ్మయి, అసోసియేట్ ప్రొఫెసర్‌ జరుహా, వైద్యులు అరుణజ్యోతి, కరుణప్రియ, సోని ఆదివారం తెలిపారు. వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి పర్యవేక్షకులు నరేందర్‌కుమార్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని