AP Roads: ఆంధ్రాలో గుంతలు.. ఒడిశా మరమ్మతులు

పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి కొమరాడ మండలంలోని కూనేరు వెళ్లే రాష్ట్ర రహదారి గుంతలు పడటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

Updated : 21 Aug 2023 06:49 IST

కొమరాడ, న్యూస్‌టుడే: పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి కొమరాడ మండలంలోని కూనేరు వెళ్లే రాష్ట్ర రహదారి గుంతలు పడటంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఈ ప్రాంతంలో గుంతల్లో లారీలు కూరుకుపోయి గంటల కొద్దీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు దెబ్బతింటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఒడిశాలోని రాయగడకు చెందిన లారీ అసోసియేషన్‌ సభ్యులు ముందుకు వచ్చారు. ఆదివారం జేసీబీ సాయంతో రోడ్డును తవ్వించి రెండు లారీల పిక్కరాయి వేసి చదును చేశారు. రాయగడ లారీ సంఘం నాయకుడు కొండబాబు మాట్లాడుతూ.. ఆంధ్రాలో రోడ్లు అధ్వానంగా మారడంతో లారీలు దెబ్బతింటున్నాయన్నారు. సమయంతో పాటు డబ్బులు వృథా అవుతున్నాయని వివరించారు. ఒడిశా, హైదరాబాద్‌, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రాలో లారీలతో వెళ్తుంటామని.. ఎక్కువగా పార్వతీపురం-కూనేరు దారిలోనే ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఇక్కడ యంత్రాంగం స్పందించకపోవడంతో రాయగడ సంఘం తరఫున పనులు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని