Dadisetty Raja: ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా ‘పచ్చనోట్ల హారతి’

నాయకుడొస్తే హారతులిస్తారు.. స్వాగతం పలుకుతారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఈ హడావుడి మరింత ఎక్కువే.

Updated : 23 Aug 2023 08:00 IST

‘గడప గడపకు’లో రూ.వెయ్యి చొప్పున పంచిన మంత్రి 

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: నాయకుడొస్తే హారతులిస్తారు.. స్వాగతం పలుకుతారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఈ హడావుడి మరింత ఎక్కువే. ఈ సమయంలో ప్రజలపై నాయకులు చూపే అభిమానమూ అదేస్థాయిలో ఉంటోంది. కాకినాడ జిల్లా తుని మండలం కేవో మల్లవరం, రాపాక గ్రామాల్లో మంగళవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి దాడిశెట్టి రాజా(Dadisetty Raja) పాల్గొన్నారు. మల్లవరంలో మహిళలు మంత్రికి హారతులు పట్టారు. కొందరు రాఖీలు కట్టారు. దీంతో మంత్రి రాజా వారికి రూ.వెయ్యి చొప్పున అందించారు. ఓ చేత్తో నోట్లకట్ట పట్టుకుని.. మరోచేత్తో హారతిపళ్లెంలో డబ్బులు వేస్తున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. హారతి ఇచ్చి, రాఖీ కడితే పళ్లెంలో డబ్బులు వేయడం సంప్రదాయమేనని అధికారపక్ష నాయకులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని