CM Jagan: సీఎం సభకు జనాల తరలింపునకు ఆదేశాలు

సీఎం సభ అంటేనే అధికారులు హడలిపోతున్నారు. జన సమీకరణకు వారిపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలు, యానిమేటర్లు, ఆశా కార్యకర్తలు ఇలా అన్ని వర్గాల వారిని తరలించేందుకు అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు.

Updated : 11 Oct 2023 07:32 IST

సిబ్బందిపై పెరుగుతున్న ఒత్తిడి

కాకినాడ కలెక్టరేట్‌, కొత్తపల్లి, న్యూస్‌టుడే: సీఎం సభ అంటేనే అధికారులు హడలిపోతున్నారు. జన సమీకరణకు వారిపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలు, యానిమేటర్లు, ఆశా కార్యకర్తలు ఇలా అన్ని వర్గాల వారిని తరలించేందుకు అధికారులకు లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. వాట్సప్‌ సందేశాలను గ్రూపుల వారీగా చేరవేస్తున్నారు. ‘సీఎం సభ ఎక్కడో జరుగుతుంటే మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు. అంత దూరం మేమెందుకు రావాలి’ అని డ్వాక్రా మహిళలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే సభకు రాలేమని తేల్చి చెబుతున్నారు.

కనీసం లక్ష మంది మహిళలు: కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ శివారు జగనన్న లేఅవుట్‌లో నిర్మించిన సామూహిక గృహాలను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు గృహప్రవేశాల కార్యక్రమానికి ఈ నెల 12న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారు. ఈ సభకు కనీసం లక్ష మంది డ్వాక్రా మహిళలను తరలించాలని ఉన్నతాధికారులు హుకుం జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని