Special Trains: దసరాకు కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు.. ఈ తేదీల్లోనే

దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ-కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

Updated : 15 Oct 2023 10:27 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ-కాకినాడ టౌన్‌ మధ్య ప్రత్యేక రైళ్ల (dussehra special Trains)ను నడపనున్నారు. ఈ నెల 19, 26 తేదీల్లో కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు(07653) రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 20, 27 తేదీల్లో కాకినాడ పట్టణం నుంచి ప్రత్యేక రైలు(07654) సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు కాచిగూడకు చేరుకోనుంది. ఇది మల్కాజిగిరి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని