CM KCR: సెంటిమెంటు దేవుడికి వినతి.. కేసీఆర్‌కు ఆనవాయితీ..!

ప్రతి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వేయడానికి ముందు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది.

Updated : 04 Nov 2023 10:05 IST

నేడు ‘కోనాయిపల్లి’ గుడిలో నామపత్రాలకు సీఎం పూజలు

నంగునూరు, న్యూస్‌టుడే: ప్రతి ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వేయడానికి ముందు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయంలోని నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలుచేసి విజయాన్ని ప్రసాదించాలని వేడుకుంటారు. అలాగే ఈ ఎన్నికల్లో గజ్వేల్‌, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్‌ తాను దాఖలు చేయనున్న నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయడానికి శనివారం ఆలయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డుమార్గం ద్వారా గ్రామానికి చేరుకుని వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. నామపత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 9న ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు. సిద్దిపేట నుంచి తెదేపా అభ్యర్థిగా మొదటిసారిగా పోటీచేసిన 1985 నుంచి కేసీఆర్‌ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పునర్నిర్మాణం తర్వాత మొదటిసారిగా కేసీఆర్‌ ఆలయాన్ని సందర్శిస్తుండగా.. అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని