ఈ దారిలో వెళ్లాలంటే.. క్రేన్లు తీసుకెళ్లాలి!

పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ నుంచి సాలూరుకు వెళ్లే రోడ్డులో సొంత వాహనంలో ప్రయాణం చేస్తున్నారా? అయితే.. రెండు మూడు స్టెప్నీలు, ఓ మెకానిక్‌, ఇంకా అవసరమైతే క్రేన్లూ అందుబాటులో ఉండేలా చూసుకోండి.

Updated : 04 Nov 2023 08:13 IST

పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ నుంచి సాలూరుకు వెళ్లే రోడ్డులో సొంత వాహనంలో ప్రయాణం చేస్తున్నారా? అయితే.. రెండు మూడు స్టెప్నీలు, ఓ మెకానిక్‌, ఇంకా అవసరమైతే క్రేన్లూ అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ మార్గం అంత దారుణంగా ఉంటుంది. మొత్తం 18 కి.మీ. పొడవే. పేరుకు తారు అయినా.. మట్టి రోడ్డు కన్నా అధ్వానంగా ఉంది. రోజుకో వాహనం ఈ మార్గంలో దిగబడుతోంది. ఏడాది క్రితం పాయకపాడు గ్రామ సమీపంలో రోడ్డు మధ్యలో గుంత పడింది. దాన్ని పూడ్చకపోవడంతో పెద్దగా మారింది. పొలాల మీదుగా వచ్చిన నీరు ఆ గుంతలో నిలుస్తోంది. వాహనాలు అందులో దిగబడుతున్నాయి. శుక్రవారం ఓ కారు కూరుకుపోయింది. కారు యజమాని స్థానికులను సాయమడిగితే వచ్చి అతికష్టం మీద దాన్ని బయటికి లాగారు. పోయిన గురువారం, గత నెల 27న లారీలు దిగబడితే.. వాటిని లాగేందుకు క్రేన్లు తెప్పించాల్సి వచ్చింది.

న్యూస్‌టుడే, మక్కువ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని