Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ మద్దతు కోరిన లండన్‌ మేయర్‌ అభ్యర్థి

లండన్‌ మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన తరుణ్‌ గులాటీ బుధవారం హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరారు.

Updated : 09 Nov 2023 07:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: లండన్‌ మేయర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన తరుణ్‌ గులాటీ బుధవారం హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరారు. స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు, జనసైనికులు ఎక్కువగా ఉన్నారని గులాటీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ అభ్యర్థనను పవన్‌కల్యాణ్‌ స్వాగతించినట్లు, ఆయనను అభినందించినట్లు జనసేన ఒక ప్రకటనలో వెల్లడించింది. తన అభిమానులు, జనసేన శ్రేణులు, తెలుగువారు, భారతీయులు తరుణ్‌ గులాటీ విజయానికి కృషి చేయాలని పవన్‌ కల్యాణ్‌ కోరినట్లు ఈ ప్రకటనలో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని