Dharmana PrasadaRao: ఏపీలో విద్యుత్తు ఛార్జీల పెంపు వాస్తవమే: మంత్రి ధర్మాన

రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీల పెంపు వాస్తవమేనని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వినియోగం పెరగడంతో అవసరమైన విద్యుత్తును ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నామని, ఆ మొత్తం వినియోగదారులు భరించడం అనివార్యమన్నారు.

Updated : 11 Nov 2023 07:42 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీల పెంపు వాస్తవమేనని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వినియోగం పెరగడంతో అవసరమైన విద్యుత్తును ప్రైవేటు కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నామని, ఆ మొత్తం వినియోగదారులు భరించడం అనివార్యమన్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సభలో ఆయన మాట్లాడారు. గతంలో ఓటేయని ఇతర పార్టీల వారిని ప్రభుత్వాలు హింసించేవని, ప్రస్తుతం అలాంటి విధానం లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు