ఏపీలో ఎయిర్‌ఫైబర్‌ సేవలు విస్తరించిన జియో

రిలయన్స్‌ జియో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఎయిర్‌ఫైబర్‌ సేవలను రాష్ట్రంలో విస్తరించినట్లు జియో ఏపీ సీఈవో ఎం.మహేశ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 28 Nov 2023 04:25 IST

45 నగరాల్లో అందుబాటులోకి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రిలయన్స్‌ జియో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఎయిర్‌ఫైబర్‌ సేవలను రాష్ట్రంలో విస్తరించినట్లు జియో ఏపీ సీఈవో ఎం.మహేశ్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, స్మార్ట్‌ హోమ్‌ సేవలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ ఎండ్‌-టు-ఎండ్‌ సొల్యూషన్‌ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 45 నగరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దీని ద్వారా రాష్ట్ర డిజిటల్‌ ల్యాండ్‌స్కేప్‌కు గణనీయమైన మెరుగుదల ఉంటుందని తెలిపారు. జియో.. ఎయిర్‌ఫైబర్‌ సేవల విస్తరణతో యువతకు అత్యాధునిక కనెక్టివిటీ పరిష్కారాలను అందించడానికి నిబద్ధతతో పని చేస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని