Ramana Deekshitulu: తిరుమలలో ఆచారాలను నాశనం చేస్తున్న ప్రభుత్వం: రమణ దీక్షితులు

తితిదే అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్‌ (ట్విటర్‌)లో పలు ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్‌ చేశారు.

Updated : 28 Nov 2023 07:12 IST

ప్రధానికి ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌లో ఆరోపణ, అనంతరం తొలగింపు

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్‌ (ట్విటర్‌)లో పలు ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్‌ చేశారు. మోదీ సోమవారం శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో రమణదీక్షితులు(Ramana Deekshitulu) ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘భారత ప్రధానికి శుభోదయం. తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలనను హిందూయేతర అధికారి, రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా నాశనం చేస్తున్నారు. సనాతన ఆచారాలు, తితిదే పరిధిలోని పురాతన నిర్మాణాల ధ్వంసం సాగుతోంది. వాటి నుంచి రక్షించి తిరుమలను హిందూ రాష్ట్రంగా అత్యవసరంగా ప్రకటించాలి. శ్రీవారి ఆశీస్సులు మీకుంటాయి.’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై ‘జగనన్న వారియర్స్‌’ సభ్యులు ప్రతిదాడికి దిగారు. ముందుగా రమణదీక్షితులుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ రీట్వీట్‌ చేశారు. కొంతసేపటికి రమణదీక్షితులు తన ట్వీట్‌ను తొలగించారు. గతంలోనూ ఇదే తరహాలో ట్వీట్‌లు చేసిన ఆయన ఆ వెంటనే తొలగించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని