Rameswaram Express: రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో చిత్తూరు-పాకాల రైలు మార్గంలో విరిగిన రైలు పట్టాను ట్రాక్‌మెన్‌ సుజిత్‌ సకాలంలో గుర్తించడంతో రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం పెను ప్రమాదం తప్పింది.

Updated : 28 Nov 2023 07:34 IST

ట్రాక్‌మెన్‌ అప్రమత్తతతో రైలు నిలిపివేత

పూతలపట్టు, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో చిత్తూరు-పాకాల రైలు మార్గంలో విరిగిన రైలు పట్టాను ట్రాక్‌మెన్‌ సుజిత్‌ సకాలంలో గుర్తించడంతో రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌కు సోమవారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 9.30 గంటల సమయంలో ఈ రైలు చిత్తూరు నుంచి తిరుపతికి బయల్దేరింది. అదే సమయంలో ట్రాక్‌మెన్‌ పట్టాలు పరిశీలిస్తున్నారు. కొత్తకోట సమీపాన విరిగిన పట్టాను గమనించి వెంటనే ఎర్రజెండా చూపుతూ రైలుకు ఎదురుగా పరుగు తీశారు. అతడిని గమనించిన డ్రైవర్‌ వెంటనే రైలు నిలిపేశారు. రైల్వే సిబ్బంది హుటాహుటిన వచ్చి విరిగిన పట్టాకు మరమ్మతు చేశారు. దీంతో రైలు దాదాపు 45 నిమిషాలు అక్కడే నిలిచిపోయింది. స్టేషన్‌ లేనిచోట రైలు హఠాత్తుగా ఆగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చలికాలంలో రైలు పట్టాలకు పగుళ్లు రావడం సాధారణమేనని సిబ్బంది పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని