Kachidi Fish: ఒక్క చేప.. రూ.3.9 లక్షలు!

గోల్డెన్‌ ఫిష్‌గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు.

Updated : 28 Nov 2023 08:37 IST

గోల్డెన్‌ ఫిష్‌గా పిలిచే అరుదైన కచిడి చేప(Kachidi Fish) సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. పూడిమడకకు చెందిన వ్యాపారి మేరుగు కొండయ్య దీన్ని రూ.3.90 లక్షలకు దక్కించుకున్నారు. ఈ మీనం 27 కేజీల బరువు ఉందని మత్స్యకారుడు మేరుగు నూకయ్య తెలిపారు. కచిడి చేపలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు తెలిపారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్‌ బ్లాడర్‌తో తయారు చేస్తారని, మందుల తయారీలోనూ దీని భాగాలను ఉపయోగిస్తారని పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, అచ్యుతాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని