వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ మూడో వివాహం

వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.

Updated : 28 Nov 2023 06:27 IST

కైకలూరు, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వెంకట రమణ అటవీశాఖ ఏలూరు రేంజ్‌లో సెక్షన్‌ అధికారిణి సుజాతను సోమవారం ఏలూరు జిల్లా కైకలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఆయన రెండో భార్య సునీత సాక్షి సంతకం చేశారు. గతంలో వెంకట రమణకు రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా..ఆమెకు ఒక కుమార్తె ఉన్నారు. తరవాత కైకలూరు ప్రాంతానికి చెందిన సునీతను రెండో వివాహం చేసుకోగా ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సునీత విజయవాడలో ఉంటున్నప్పటికీ పిల్లలతో కలిసి జయమంగళ ఇంటికి వచ్చి వెళ్తున్నారు. రెండో భార్య, పిల్లల అంగీకారంతోనే జయమంగళ మూడో వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం వివాహం చేసుకున్న సుజాతకు ఇది రెండో వివాహం. ఆమెకు ఒక కుమారుడు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని