ఇంటర్‌ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!

నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఘర్షణ జరిగి సోమవారం రాత్రి సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

Published : 29 Nov 2023 06:14 IST

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఘర్షణ జరిగి సోమవారం రాత్రి సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. విషయం తెలిసిన కళాశాల యాజమాన్యం.. వారిని దండించడం కోసం మంగళవారం విద్యార్థులను కర్రతో కొట్టడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. ఒక విద్యార్థికి చెయ్యి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. దీంతోపాటు ఆరుగురు విద్యార్థులకు కళాశాల సిబ్బంది శిరోముండనం చేయించినట్లు సమాచారం. ఈ విషయం పట్టణమంతా చర్చనీయాంశంగా మారింది. వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని