వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం

రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం భాజపా కిసాన్‌ మోర్చా చేపట్టిన వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.

Published : 29 Nov 2023 05:21 IST

గుంటూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం భాజపా కిసాన్‌ మోర్చా చేపట్టిన వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. నాయకులను ఇళ్ల వద్దే నిర్బంధించేందుకు పోలీసులు యత్నించారు. రైతు బజార్‌లో కూరగాయలు కొనేందుకు వచ్చిన మహిళా నేతల్నీ అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ కొందరు కమిషనర్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారంతా ఒక్కసారిగా గేటు వద్దకు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకునే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో నాయకులు అక్కడే బైఠాయించారు. అధికారులు బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. చివరికి భాజపా కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామితో పాటు పలువురిని అరెస్టు చేశారు. వారిని బలవంతంగా నల్లపాడు, నగరంపాలెం స్టేషన్లకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని