ఇక్కడ ఓటుంటేనే గుంతలు పూడుస్తాం

ఓటరు కార్డులను ప్రామాణికంగా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలనే విచిత్ర ఆలోచన చంద్రగిరి నియోజకవర్గ అధికార పార్టీ నేతలకు వచ్చింది.

Published : 29 Nov 2023 05:54 IST

ఎం.కె.నాయుడు కాలనీ వాసులకు చంద్రగిరి నేతల సమాధానం

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: ఓటరు కార్డులను ప్రామాణికంగా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలనే విచిత్ర ఆలోచన చంద్రగిరి నియోజకవర్గ అధికార పార్టీ నేతలకు వచ్చింది. ‘దారంతా గుంతలతో నిండి రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది. కొత్త రోడ్డు వేయించండి’ అని వీధివాసులు అడగగా.. ఓటరు కార్డులు ఉంటేనే రోడ్డు వేస్తామని నేతలు చెప్పడంతో వారు విస్తుపోయారు. తిరుపతి నగరానికి తూర్పు, పడమర, దక్షిణ దిక్కుల్లో గ్రామ పంచాయతీలు విస్తరించాయి. అక్కడి బైరాగపట్టెడ సమీపంలోని ఎం.కె.నాయుడు కాలనీ ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో స్థానికులు చంద్రగిరి ప్రజాప్రతినిధిని కలిసి కొత్త రోడ్డు కోసం విన్నవించారు. దీనిపై ఆ నేత సూచనతో స్థానిక ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఓటరు కార్డులు ఉన్నాయా అని అక్కడివారిని ప్రశ్నించారు. వారిలో కొంతమంది కార్డులు చూపించారు. ఇందులో కొందరు చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లుగా ఉండగా ఎక్కువమంది తిరుపతి నగరపాలిక పరిధిలో ఉండటంతో నిర్మాణానికి నిధులు లేవంటూ వెనక్కి వెళ్లిపోయారు. ఈ రోడ్డు వేసినా ఓట్లు రావని భావించే ఇలా చేశారని స్థానికులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని