వైకాపా నాయకులు వేధిస్తున్నారని.. అయిదుగురు వాలంటీర్ల రాజీనామా

‘వైకాపా నాయకుల వేధింపులు భరించలేకున్నాం. పని కూడా చేయలేకపోతున్నాం’ అని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సచివాలయానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు రాజీనామా చేశారు.

Published : 29 Nov 2023 05:24 IST

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ‘వైకాపా నాయకుల వేధింపులు భరించలేకున్నాం. పని కూడా చేయలేకపోతున్నాం’ అని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సచివాలయానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు రాజీనామా చేశారు. వి.ఉదయకిరణ్‌, కె.రాధిక, ఎస్‌.లీలావతి, ఎం.వెంకటేశ్వర్లు, కె.సుమతి అనే వాలంటీర్లు మంగళవారం ఉదయం ఎంపీడీవో హేమలతా దేవికి రాజీనామా పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ వైకాపా నాయకులే కాకుండా ఇతర ప్రాంతాల నాయకులూ సచివాలయానికి వచ్చి నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని, లేకుంటే తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సచివాలయ అధికారుల సూచనల మేరకు పనులు చేస్తున్నా వైకాపా నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మద్యం తాగి కార్యాలయంలోకి వచ్చి తమకు కుర్చీలు వేయాలని, నాయకులను గౌరవించరా అంటూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని