ఎస్‌ఆర్‌ఎం వీసీ మనోజ్‌ కుమార్‌కు ప్రతిష్ఠాత్మక ‘భాస్కర’ అవార్డు

ఏపీ-ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య మనోజ్‌ కుమార్‌ అరోడాకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన ‘భాస్కర’ అవార్డు లభించింది.

Published : 29 Nov 2023 05:28 IST

తుళ్లూరు, న్యూస్‌టుడే: ఏపీ-ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య మనోజ్‌ కుమార్‌ అరోడాకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన ‘భాస్కర’ అవార్డు లభించింది. ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (ఐఎస్‌ఆర్‌ఎస్‌) ఈ అవార్డును ప్రకటించింది. మంగళవారం పుణెలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేశారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డా.శైలేష్‌ నాయక్‌, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ ప్రెసిడెంట్‌ డా.ప్రకాశ్‌ చౌహాన్ల చేతుల మీదుగా మనోజ్‌ కుమార్‌ అరోడా ఈ అవార్డును అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని