నిరుపయోగంగా ఏకరూప దుస్తులు

Published : 29 Nov 2023 05:32 IST

పులివెందుల, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తులు, బూట్లు, సాక్సులు మూలకు చేరాయి. మండలంలోని 55 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 6,715 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ 3 జతల చొప్పున ఏకరూప దుస్తులు, ఒక జత చొప్పున బూట్లు, సాక్సులు అందించాల్సి ఉంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ప్రతిపాదనల మేరకు దుస్తులు అందించి మిగిలిన వాటిని వెనక్కి పంపాల్సి ఉన్నా ఇలా మూలన పడేశారు. వీటిని పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలోని ఓ గదిలో మూటలుగా కట్టి వదిలేయడంతో దుమ్ము, ధూళి పేరుకుపోతోంది. గత విద్యాసంవత్సరం నుంచి అవి నిరుపయోగంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇన్‌ఛార్జి ఎంఈవో శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా.. రెండు రోజుల క్రితమే తాను బాధ్యతలు చేపట్టానని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో చాలామంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు తక్కువగా వచ్చాయని, గదిలో ఉన్నవి పాతవి అయిఉండొచ్చని.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని