CM Jagan: పిల్లల కళ్లజోళ్ల మీదా ఆయన బొమ్మే

జగన్‌ ప్రచార కాంక్షకు మరో ఉదాహరణ. పిల్లలకు ఇచ్చే కళ్లజోళ్ల మీద కూడా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫొటోలు దర్శనమిచ్చాయి.

Updated : 29 Nov 2023 08:40 IST

అమరావతి, న్యూస్‌టుడే: జగన్‌ ప్రచార కాంక్షకు మరో ఉదాహరణ. పిల్లలకు ఇచ్చే కళ్లజోళ్ల మీద కూడా ముఖ్యమంత్రి(CM Jagan), వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫొటోలు దర్శనమిచ్చాయి. ఇటీవల స్కూళ్లలో చిన్నారులకు కంటి వెలుగు పథకంలో భాగంగా వైద్య పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని పలు స్కూళ్లలో అవసరమైన బాలబాలికలకు మంగళవారం కళ్లజోళ్లు పంపిణీ చేశారు. కళ్లజోడు పెట్టుకునే పెట్టె మీద సైతం సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫొటోలు పార్టీ రంగులతో ప్రచురితమయ్యాయి. ప్రచారం కోసం పిల్లలను సైతం వదలడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని