Vizag: సాగర సర్పం.. కాటేస్తే కష్టం

విశాఖ నగర పరిధి సాగర్‌నగర్‌ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది.

Updated : 29 Nov 2023 07:32 IST

విశాఖ నగర పరిధి సాగర్‌నగర్‌ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. సాగర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ జీవి సాంకేతిక నామం ‘హైడ్రో ఫిస్‌ సీ స్నేక్‌’ అని మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇవి విషపూరిత మైనవని.. కాటు వేసినపుడు సకాలంలో వైద్యం చేయించుకోకుంటే ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు. చిన్న చేపలు, రాళ్లలోని నాచు తింటూ ఇవి మనుగడ సాగిస్తాయని చెప్పారు. ఆహార అన్వేషణలో భాగంగా చేపల గుంపుల్లో కలిసిపోయిన సందర్భాల్లో వలల్లో చిక్కుకుంటాయన్నారు. దీనిని మత్స్యకారులు కట్ల పాము అని పిలుస్తుంటారు. సుమారు ఏడడుగులున్న ఈ పామును మత్స్యకారులు తిరిగి సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు.

న్యూస్‌టుడే, విశాఖపట్నం (సాగర్‌నగర్‌)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని