నేడు సుప్రీంకోర్టు ముందుకు ఫైబర్‌నెట్‌ ముందస్తు బెయిల్‌ కేసు

ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు రానుంది.

Updated : 30 Nov 2023 06:44 IST

ఈనాడు, దిల్లీ: ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు రానుంది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటల తర్వాత దీనిని విచారించనుంది. ఇది గత నెల 13, 17, 20, నవంబరు 9 తేదీల్లో ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో అందులో తీర్పు ఇచ్చిన తర్వాత దీన్ని పరిశీలిస్తామని న్యాయమూర్తులు గత విచారణ సమయంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెలువరించిన తర్వాతే దీనిని పరిశీలిస్తామని న్యాయమూర్తులు మరోసారి అభిప్రాయపడొచ్చని న్యాయవాదులు అంచనా వేస్తున్నారు.

ఓటుకు నోటు కేసు జనవరికి వాయిదా

తెలంగాణలోని ఓటుకు నోటు కేసును సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జనవరి రెండో వారానికి వాయిదా పడింది. ప్రతివాదుల తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అనారోగ్య కారణంగా హాజరుకాలేకపోతున్నారని, అందువల్ల వాయిదా వేయాలని కోరడంతో ధర్మాసనం దీన్ని జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని