చంద్రబాబు ముందస్తు బెయిలుపై విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

Updated : 30 Nov 2023 06:46 IST

ఈనాడు, అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఏజీ వాదనలు వినిపించేందుకు సీఐడీ తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ రాజధానికి సంబంధించిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్‌ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టులో చంద్రబాబు వేసిన పిటిషన్‌పై పిటిషనర్‌ తరఫు వాదనలు ముగియగా.. సీఐడీ వాదనను వినిపించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని