నేడు తిరుమలకు చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Updated : 30 Nov 2023 06:43 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి; న్యూస్‌టుడే, తిరుమల, కుప్పం: తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరుపతి చేరుకుంటారు. ఆ రాత్రికి తిరుమల కొండ పైనున్న శ్రీగాయత్రి నిలయంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి అమరావతికి బయలుదేరుతారని తెదేపా ఓ ప్రకటనలో పేర్కొంది.

రెండో వారంలో కుప్పం పర్యటన

మరోవైపు చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో డిసెంబరు రెండో వారంలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమల, శ్రీశైలం, సింహాచలంతోపాటు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాల దర్శనానంతరం.. ఈ పర్యటన ఉంటుందని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని