విదేశాల్లో దీక్షా దివస్‌

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్‌ నిర్వహించారు.

Updated : 30 Nov 2023 05:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్‌ నిర్వహించారు. అమెరికాలోని ఫ్లోరిడా, టెక్సాస్‌, న్యూయార్క్‌లలో, బ్రిటన్‌ రాజధాని లండన్‌లో, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌, మెల్‌బోర్న్‌, సిడ్నీతో పాటు మలేసియా, న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, దక్షిణాఫ్రికా, ఖతర్‌, కువైట్‌, టాంజానియా తదితర దేశాల్లో దీక్షా దివస్‌ నిర్వహించినట్లు భారాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్‌ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా రక్తదానం, పండ్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలతో పాటు ప్రదర్శనలు జరిపినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు